Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ రణరంగాన్ని తలపిస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రాజధాని ఇస్లామాబాద్ మార్చ్‌కి పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో నిరసనకారులు ఇస్లామాబాద్‌కి చేరుకోవడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో నలుగురు పోలీసులు, ఒక పౌరుడు మరణించాడు. ఇదిలా ఉంటే, పరిస్థితిని చక్కదిద్దేందుకు జోక్యం చేసుకోవాలని ప్రభుత్వం పాక్ ఆర్మీని కోరింది.