Israel-Pakistan: బయటకు ఇజ్రాయిల్ అంతే శత్రుదేశంగా భావించే పాకిస్తాన్, తెర వెనక మాత్రం ఇజ్రాయిల్ స్నేహాన్ని కోరుకుంటోంది. ఇటీవల, ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, పాకిస్తాన్‌లో తెహ్రీక్ ఏ లబ్బాయిక్ పాకిస్తాన్(టీఎల్‌పీ) పెద్ద ఎత్తున ఇజ్రాయిల్ వ్యతిరేక ఆందోళల్ని నిర్వహించింది. దీనిని పాక్ ఆర్మీ, పోలీసులు కఠినంగా అణిచివేశారు. సొంత ప్రజలపైనే కాల్పులు జరిపారు. ఈ అల్లర్లలో పలువురు మరణించారు.
Pakistan: యుద్ధ భయంతో పాకిస్థాన్ అగ్రనాయకత్వం విదేశాలకు పారిపోయినట్లు పలు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం దాయాది దేశం అగ్ర నాయకత్వం సౌదీ అరేబియాలో ఉంది. పాక్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ రియాద్‌లో జరుగుతున్న ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ (FII9) సమావేశంలో పాల్గొంటున్నారు. అలాగే ఆయన సౌదీ అగ్ర నాయకత్వంతో అనేక ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో సౌదీ అరేబియా నుంచి కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న జోర్డాన్‌లో…
Pakistan: పాకిస్తాన్ ఒకే సారి రెండు దేశాలతో ప్రేమాయణం నడుపుతోంది. చైనాకు కన్నుగీటి, అమెరికాను కౌగిలించుకుంటోంది. తమ ఉక్కు స్నేహితుడిగా చైనాను, పాకిస్తాన్ పిలుస్తుంటుంది. అయితే, అలాంటి స్నేహితుడిని ఇప్పుడు పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ నాయకత్వం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు దగ్గర అవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇప్పటికే ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో విందులో పాల్గొన్నారు. ఇప్పుడు, పాకిస్తాన్ ప్రధాని కూడా ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.
Shehbaz Sharif: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్-రష్యా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-రష్యా సంబంధాలను తాము గౌరవిస్తున్నామని చెప్పారు. చైనాలో జరిగిన ఎస్‌సీఓ సమావేశానికి హాజరైన షరీఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. మాస్కోకు న్యూఢిల్లీతో ఉన్న సంబంధాలను ఇస్లామాబాద్ గౌరవిస్తుంది, అవి చాలా బాగున్నాయని మంగళవారం షరీఫ్ అన్నారు.
భారతదేశంతో ఉద్రిక్తత మధ్య, పాకిస్థాన్ చైనాతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిని పాకిస్థాన్ తన విజయాలలో ఒకటిగా భావిస్తోంది. వాణిజ్యం, వ్యవసాయం, పరిశ్రమలు సహా అనేక కీలక రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి పాకిస్థాన్ అంగీకరించింది. పాకిస్థాన్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. మంగళవారం చైనాలో వాంగ్ యితో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సమావేశం తర్వాత చైనాతో వాణిజ్య ఒప్పందం ప్రకటించారు.