Pakistan: ఆదివారం ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, ఈ టోర్నీలో పాక్ పేసర్ హారిస్ రవూఫ్ చేసిన ‘6-0’ సంజ్ఞపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, తాము 6 భారత విమానాలను కూల్చేశామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. దీనిపై అక్కడి మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించింది. తమ ఎయిర్ బేస్‌లు దారుణంగా దెబ్బతిన్న విషయాన్ని కూడా…
Khawaja Asif: భారత్- పాకిస్తాన్ మధ్య ఓ వైపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ చేసిన కొన్ని ప్రకటనలు కామెడీని మించుతున్నాయి. ముఖ్యంగా, ఆయన అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో చేసిన వ్యాఖ్యలు సొంతదేశంలోనే ట్రోల్‌కి గురవుతున్నాయి. అక్కడి ఎంపీలు రక్షణ మంత్రి దేశాన్ని నవ్వులపాలు చేస్తున్నాడని మండిపడుతున్నాయి.
India invites Pakistan: ఏప్రిల్ నెలలో జరగనున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీఓ) సమావేశానికి పాకిస్తాన్ దేశాన్ని భారత్ ఆహ్వానించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరగాల్సిన ఎస్ సీఓ రక్షణ మంత్రుల సమావేశానికి భారతదేశం నుంచి ఆహ్వనం అందినట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుకు కూడా భారత్ ఆహ్వానం పంపింది. ఖవాజా భారత్ పంపిన ఆహ్వానాన్ని అంగీకరించారు.