Pakistan: జింబాబ్వే, ఆస్ట్రేలియా పర్యటనలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. అయితే ఇందులో జింబాబ్వే పర్యటనలో మాజీ కెప్టెన్ బాబర్ ఆజం జట్టులో భాగం కావడం లేదు. జింబాబ్వే పర్యటనలో ఫాస్ట్ బౌలర్లు షహీన్ అఫ్రిది, నసీమ్ షాలకు కూడా విశ్రాంతి కల్పించారు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు టెస్టు మ్యాచ్‌లకు కూడా బాబర్, షాహీన్, నసీమ్ పాకిస్థాన్ జట్టులో లేరు. అయితే, ఆస్ట్రేలియా టూర్‌లో బాబర్, షాహీన్, నసీమ్‌లు రెండు జట్లలోనూ ఉన్నారు.…