Breaking News: బలూచిస్తాన్‌లో రైలు హైజాక్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబన్ల దాడులతో పాకిస్తాన్ అట్టుడికిపోతోంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది.
Pakistan : పాకిస్థాన్‌లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో 10 మంది సైనికులతో సహా కనీసం 15 మంది మరణించారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మొత్తం 13 మంది దాడికి పాల్పడ్డారని పాక్ సైన్యం కూడా ప్రకటించింది.
Pakistan : దాయాది దేశం పాకిస్థాన్ నుంచి ఓ షాకింగ్ వార్త బయటకు వస్తోంది. పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం కార్యాలయం వెలుపల బాంబు పేలింది.
Peshawar Mosque Blast: పాకిస్తాన్ పెషావర్ నగరంలో సోమవారం మసీదులో బాంబు పేలుడు కారణంగా 101 మంది మరణించారు. అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతంలో బాంబు పేలుడు చోటు చేసుకోవడం పాకిస్తాన్ నిఘా వ్యవస్థను ప్రశ్నిస్తోంది. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల అలసత్వం, భద్రతాలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
వ్యాపార కేంద్రంలో బాంబ్ పేలడంతో ఒకరు మృతి చెందిన ఘటన పాకిస్థాన్ కరాచీలోని ఖరద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ పేలుడు సోమవారం రాత్రి సంభవించింది. ఇందులో ఓ పోలీసు ఆఫీసర్ తో పాటు దాదాపు 12 మంది వ్యక్తులకు గాయాలైనట్లు అధికారు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో.. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటన చేరుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ పేలుడు కోసం దుండగులు మోటారు…
పాకిస్థాన్‌లో మరోసారి దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు.. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఇవాళ ఆత్మాహుతి దాడి జరిగింది… ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రగాయాలపాలైన స్థానిక మీడియా పేర్కొంది… ఇక, ఈ దాడి తమపనేనంటూ తెహరీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.. ఆత్మాహుతి దాడిపై మీడియాతో మాట్లాడిన క్వెట్టా డిప్యూటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అజహర్ అక్రమ్.. క్వెట్టాలోని మస్టుంగ్ రోడ్డులో ఉన్న ఫ్రాంటియర్ కార్ప్స్ చెక్‌పోస్ట్‌పై ఆత్మాహుతి దాడి జరిగిందని.. దాడిలో…