Asim Munir: ఇరాన్‌కు “యుద్ధ వేషం”, అమెరికాకు “సూట్”.. అసిమ్ మునీర్ డ్రెస్సింగ్ వెనక వ్యూహం..
- అమెరికా-ఇరాన్ చర్చల్లో కీలకంగా అసిమ్ మునీర్..
- ఆయన డ్రెస్సింగ్‌పై ఇప్పుడు చర్చ..
- ఇరాన్‌తో సైనిక దుస్తుల్లో, అమెరికాతో ఫార్మల్ సూట్‌లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asim Munir: పాకిస్తాన్‌లో నిజమైన అధికారం ఆ దేశ సైన్యానిదే అని మరోసారి రుజువైంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా చర్చల బృందానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇరాన్‌కు ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే, ఈ చర్చల్లో పాక్ సైన్యాధిపతి, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కన్నా పవర్‌ఫుల్ వ్యక్తిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు.
అయితే, ఈ చర్చల సందర్భంగా అసిమ్ మునీర్ డ్రెస్సింగ్ చర్చనీయాంశంగా మారింది. మునీర్ ఇరాన్ ప్రతినిధులను కలిసినప్పుడు ఒకలా, అమెరికా ఉపాధ్యక్షుడిని కలిసినప్పుడు మరోలా డ్రెస్ వేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ , విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ నేతృత్వంలోని బృందాన్ని స్వాగతించినప్పుడు అసిమ్ మునీర్ కాంబాట్ యూనిఫాం (సైనిక దుస్తులు)లో కనిపించారు. కానీ కొన్ని గంటల తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను రిసీవ్ చేసినప్పుడు ఆయన పూర్తి ఫార్మల్ సూట్‌లో దర్శనమిచ్చారు.
Also Read
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
Read Also: Indian Players Struggle: ఈ భారత స్టార్ ప్లేయర్లకు ఏమైంది?.. ఐపీఎల్ 2026లో తడబడుతున్న టాప్ స్టార్స్!
ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దు దేశం. కాంబాట్ డ్రస్ ధరించడం ద్వారా మునీర్ సైనిక శక్తిని, సిద్ధతను చూపించారని, ఇది ఒక విధంగా భయపెట్టే చర్చగా చెప్పవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఇరాన్‌లోని సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని సున్నీ ముస్లిం తిరుగుబాటుదారులకు పాక్ మద్దతు ఇస్తుందని ఇరాన్ వాదిస్తోంది. గతంలో పలుమార్లు పాక్ భూభాగంపై వైమానిక దాడులు నిర్వహించింది. పాక్ కూడా ఇదే విధంగా ఇరాన్‌పై దాడులు చేసింది. ఈ క్రమంలో ఇరాన్‌కు ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వడానికి మునీర్ సైనిక దుస్తుల్లో కనిపించారని చెబుతున్నారు.
ఇక జేడీ వాన్స్‌ను రిసీవ్ చేసుకున్న సమయంలో మునీర్ తనను తాను రాజకీయ నాయకుడిగా, డిప్లొమాట్‌గా చూపించాలనుకున్నారు. అమెరికాతో తమ సంబంధాలు రాజకీయ, వ్యూహాత్మకంగా ఉన్నాయని ఇది సూచిస్తుంది. సాధారణంగా జేడీ వాన్స్ లాంటి వారు వస్తే పాక్ ప్రధాని కానీ, ఇతర మంత్రులు కానీ ప్రోటోకాల్ ప్రకారం వెళ్తారు. కానీ సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో మునీర్ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
ఇక మొత్తం పాకిస్తాన్‌లో తానే సర్వ శక్తివంతుడినని మునీర్ చెప్పకనే చెప్పారు. దేశంలో అసలు అధికారం తన చేతుల్లో ఉందనే సంకేతం ఇచ్చారు. గతంలో పర్వేజ్ ముషారఫ్ కాలాని అసిమ్ మునీర్ గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో ముషరఫ్ నేతృత్వంలోని సైన్యం చేతిలో పాకిస్తాన్ పాలన ఉంది. ఇప్పుడు కూడా అసిమ్ మునీర్ చేతిలోనే అధికారం ఉంది. కానీ బయటకు మాత్రం మునీర్ చెప్పినట్లు ఆడే ఒక తోలు బొమ్మగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉన్నారు.
తాజావార్తలు
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!