POK Protests: పీవోకేలో నిరసనల వేళ కాశ్మీర్ కార్డు.. పాక్ ఆర్మీ చీఫ్ తాజా వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK Protests: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్న వేళ, పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్‌పై ఆరోపణలు చేశారు. రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన 276వ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ఆయన కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అత్యంత కీలకమైన అంశంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా జమ్మూ-కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు, జనాభా మార్పులకు భారత్ పాల్పడుతోందని పాకిస్తాన్ సైన్యం ఆరోపించింది. పాకిస్తాన్ సైన్యం మీడియా విభాగం ఐఎస్పీఆర్ విడుదల చేసిన ప్రకటనలో కాశ్మీర్ పాకిస్తాన్‌కు “జుగులర్ వెయిన్” (అత్యంత కీలకమైన నాడి)గా పేర్కొంది.
మరోవైపు పీవోకేలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచింది. జూలై 8లోగా వాటిని అమలు చేయకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే అసిమ్ మునీర్ కాశ్మీర్ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమావేశంలో పాకిస్తాన్ భద్రతా పరిస్థితులు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై కూడా సమీక్ష జరిగింది. అలాగే భారత్‌పై హైబ్రిడ్ యుద్ధం, తప్పుడు ప్రచారం, సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన ఆరోపణలను కూడా పాకిస్తాన్ సైన్యం మరోసారి పునరావృతం చేసింది.
Also Read
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
- Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
మొత్తంగా.. పేదరికం, తిరుగుబాటు, నిస్సహాయత ఓవైపు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పెరుగుతున్న నిరసనల మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ.. పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ మరోసారి భారత్‌కు వ్యతిరేకంగా ప్రకటన చేస్తూ, కాశ్మీర్‌ను పాకిస్తాన్ ‘సంక్షోభం’గా అభివర్ణించారు. రావల్పిండిలో జరిగిన 276వ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన, భారత్ మానవ హక్కుల ఉల్లంఘనలకు, జనాభా మార్పులకు పాల్పడుతోందని ఆరోపించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. కాశ్మీర్‌ను పాకిస్తాన్ ‘జుగులర్ వెయిన్’ (మెడ నరం)గా, అంటే దాని అత్యంత కీలకమైన నాడిగా అభివర్ణించారు. పీఓకేలో నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ప్రకటన వెలువడింది.
తాజావార్తలు
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?