పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్ బుట్టో సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా, వీరి వ్యాఖ్యలపై ఇమ్రాన్ స్పందిస్తూ ‘‘వాళ్లు మా పార్టీని రద్దు చేస్తే చేయనీయండి. కొత్త పార్టీ పేరు మీద గెలుస్తాం అని అన్నారు. పోటీ చేయకుండా నాపై నిషేధం విధించినా, నన్ను జైల్లో వేసినా, మా పార్టీ గెలుస్తుందని ఇమ్రాన్ తెలిపారు.