తనను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనుక పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పాత్ర ఉందని అన్నారు. తనను హత్య చేసేందుకు అసిఫ్ అలీ జర్దారీ ఉగ్రవాదులకు డబ్బులు ఇచ్చారని శుక్రవారం ఆరోపించారు.