జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల తేదీలు ప్రకటించారు. భారత్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల కార్యకలాపాలు తీవ్రంగా ఉంటాయి. ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్థాన్‌కు ఇదంతా ఆమోదయోగ్యంగా లేదు.
భారత ఆర్మీ డ్రోన్‌ను పాక్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ డ్రోన్ నిఘా డ్యూటీలో ఉంది. సాంకేతిక లోపం కారణంగా.. నియంత్రణ రేఖను దాటింది. ఈ సంఘటన ఈరోజు అంటే 23 ఆగస్టు 2024 ఉదయం 9.30 గంటలకు జరిగింది.
భారత్-పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్‌కు చెందిన మరోదుశ్చర్య ఆలస్యంగా వెలుగు చూసింది. పాకిస్థాన్ పౌరులు సరిహద్దులోని 25 మీటర్ల పొడవైన ఫెన్సింగ్ ను కత్తిరించి దాన్ని తీసుకువెళ్లారు.
Imran Khan: పాకిస్తాన్ ఎన్నికలు గురువారం జరగబోతున్నాయి. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, వేర్పాటువాద ఉద్యమాలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఈ ఎన్నికలు వస్తున్నా్యి. మరోవైపు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నాడు. ఇప్పటికే అక్కడి కోర్టులు అతనికి పలు కేసుల్లో జైలుశిక్ష విధించాయి. ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు తన ఎన్నికల చిహ్నాన్ని కూడా కోల్పోయింది. ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తరుపున…
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్, భారత్‌లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లో ఉన్న శాంతి పరిస్థితులు పాకిస్తాన్‌కి నచ్చడం లేదు. కాశ్మీర్‌లో దాడులు చేసేందుకు పాక్ స్పాన్సర్డ్ ఉగ్రవాదుల్ని నియంత్రణ రేఖ దాటించి భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గత రాత్రి నలుగురు ఉగ్రవాదుల్ని, భారత్ లోకి ప్రవేశపెట్టేందుకు పాకిస్తాన్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నించింది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో తన దుర్మార్గపు కార్యకలాపాల నుంచి పాకిస్తాన్ విరమించుకోవడం లేదు. అక్కడ నివసించే కాశ్మీరీ పండిట్లపై అఘాయిత్యాలకు పాల్పడే వార్తలు రోజు వస్తూనే ఉన్నాయి. తాజాగా.. పీఓకేలోని కాశ్మీరీ పండిట్ల ప్రధాన పుణ్యక్షేత్రమైన శారదా పీఠ్ ఆలయ గోడను పాకిస్తాన్ సైన్యం కూల్చివేసింది. అంతేకాకుండా.. ఆ స్థలంలో కాఫీ షాప్ నిర్మించారు.
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం కలవరపెడుతోంది. ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ చర్యలు చేపడుతుండటం, దీనికి ప్రజా మద్దతు ఉండటంతో అక్కడి ప్రభుత్వం, సైన్యం, ఐఎస్ఐ ఇమ్రాన్ ఖాన్ ను, అతని పార్టీ పీటీఐని దెబ్బతీయాలని చూస్తున్నాయి.
Imran Khan: పాకిస్తాన్ ఆందోళనతో అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను మే 9న అరెస్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు హింసాత్మక ఆందోళనకు దిగారు. అయితే పాక్ సుప్రీంకోర్టు ఆయన్ను విడుదల చేసినా కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు. ఇదిలా ఉంటే పంజాబ్ తాత్కాలిక ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని, ఈ హింసాత్మక ఆందోళనకు కారణం అవుతోందని ఆయన విమర్శించారు.
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఆ దేశంలో విధ్వంసం సృష్టిస్తోంది. పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలు హింసాత్మక రూపుదాల్చాయి. ఇప్పటికే భద్రతాబలగాల కాల్పుల్లో 8 మంది మరణించారు. మరోవైపు ఖైబర్ ఫక్తుంఖ్వా, బలూచిస్తాన్, పంజాబ్ ప్రావిన్సుల్లో శాంతిభద్రతలను పాకిస్తాన్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది.