పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో ఆ దేశంలో పరిస్థితి గందరగోళంగా తయారైంది. పాక్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన అల్లర్లు, ఆందోళనలు బుధవారమూ కొనసాగాయి. పలుచోట్ల విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. ఏడుగురు మృతి చెందగా 300 మందికి గాయాలయ్యాయి.
Pakistan unable to feed soldiers: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది దాయాది దేశం పాకిస్తాన్. ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. పెరిగిన ధరలు, ఆహారం కొరత పాక్ ప్రజలను వేధిస్తున్నాయి. చికెన్, వంటనూనె, పప్పులు, గోధుము ఇలా అన్ని నిత్యావసరాల ధరలు చుక్కలను చూస్తున్నాయి.
దాయాది దేశమైన పాకిస్తాన్ నూతన బిల్లును సిద్ధం చేసింది. సైన్యం, న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష విధించనుంది. పాకిస్తాన్ ప్రభుత్వం క్రిమినల్ చట్టాన్ని మార్చాలని ప్రతిపాదించిన బిల్లును సిద్ధం చేసింది.
Imran Khan Calls For Fresh Polls In Pakistan: పాకిస్తాన్ తో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోయి.. షహజాబ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి అక్కడ రాజకీయ సంక్షోభం మొదలైంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆజాదీ మార్చ్ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాడు.
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని ఖోస్ట్ ప్రావిన్సుతో పాటు కునార్‌లోని షెల్టాన్ జిల్లాలో పాక్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 30 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు .26 పాకిస్థాన్ విమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. తాలిబన్ పోలీస్ చీఫ్ అధికార ప్రతినిధి ఈ దాడులను ధృవీకరించారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడినట్లు ఆయన…