ఆ ముగ్గురు కరుడుగట్టిన ఉగ్రవాదులు. 26 మందిని చంపిన నరహంతకులు. యుద్ధంలో ఆరితేరిన వారు. అధునాతన ఆయుధాలు ప్రయోగించడంలో నైపుణ్యం కలిగిన వారు. అలాంటి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం మామూలు విషయం కాదు. ఎంతో ప్రణాళిక ఉండాలి.
పహల్గామ్‌లో మారణహోమం సృష్టించిన ముష్కరులు హతమయ్యారు. సైన్యం చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు కుక్కచావు చచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సైన్యం అధికారికంగా ధృవీకరించినట్లు ఆలిండియా రేడియో వైబ్‌సైట్‌లో పేర్కొంది.