సౌదీ అరేబియా పర్యటనను ముగించుకుని భారతదేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడి నేపథ్యంలో వెంటనే చర్యలు చేపట్టారు. ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగిన కొద్ది క్షణాల్లోనే, ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, నాయకులు ప్రస్తుత గ్రౌండ్ రిపోర్టులు, కొనసాగుతున్న భద్రతా కార్యకలాపాలు, ఈ…
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కాశ్మీర్ అంతటా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలంతా భయాందోళనతో వణికిపోతున్నారు. భారత ఆర్మీని చూసినా కూడా మహిళలు, చిన్నారులు గజగజలాడిపోతున్నారు. నిన్నటి ఘటనతో ఒక విధమైన భీతావాహ వాతావరణం ఏర్పడింది.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం పర్యటకులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై తీవ్రవాదులుగా భావిస్తున్న వారి దాడి జరిగింది. ఈ దాడిలో ఇప్పటి వరకు దాదాపు 28 మంది పర్యటకులు మరణించినట్లు తెలుస్తోంది. మీడియాలో కనిపిస్తున్న కొన్ని వీడియోలలో దుండగులు ముస్లిమేతరులను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని దాడి చేశారని బాధితులు చెప్పడం కనిపించింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఊహాచిత్రాలు బయటకు వచ్చాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా,…
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. ఇదే ఘటనలో ఓ సెలబ్రిటీల జంట కూడా చిక్కుకుందనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ప్రముఖ నటి దీపికా కాకర్, ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం కలిసి పహల్గాం టూర్ కు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతూ సోషల్…
Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలియజేసేందుకే విదేశీ అతిథుల భారత పర్యటనలో ఉండగానే ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.
పహల్గామ్ దాడిలో మరో భారత వైమానిక దళ సభ్యుడు కార్పోరల్ తేజ్ హైల్యాంగ్ (30) చనిపోయాడు. సెలవుల్లో భార్యతో కలిసి కాశ్మీర్‌లోని పహల్గామ్ వెళ్లాడు. మంగళవారం మధ్యాహ్న సమయంలో భార్యతో కలిసి విహరిస్తుండగా ఒక్కసారిగా ఉగ్రవాదులు తెగబడ్డారు.
శ్రీనగర్లో పహల్గామ్ బాధిత కుటుంబాలతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతకముందు పహల్గామ్ భౌతికకాయాలకు అమిత్ షా నివాళులర్పించారు.
కశ్మీర్ భూమిపై మరోసారి భారతీయుల రక్తం చిందింది. సెలవుల్లో ఆహ్లాదంగా గడుపుదామని పహల్గామ్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృత్యుఒడికి చేరుకున్నారు. కొత్తగా పెళ్లయిన జంటల్లో భర్త కాటికి, భార్య సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పటివరకు కాశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిగా దీనిని పరిగణిస్తున్నారు. ఇందులో 28 మంది మరణించినట్లు సమాచారం. అయితే.. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది.…
పహల్గామ్ ఉగ్ర దాడికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఒక ఉగ్రవాది ఏకే-47 రైఫిల్తో చెలరేగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనాస్థలిలో ఒక ముష్కరుడు రైఫిల్తో ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్గా మారింది.