Pakistan: పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ చంపేశారు. ఈ దాడిలో 28 మంది మరణించారు. దాడికి సంబంధించిన కార్యాచరణ మొత్తం దాయాది దేశం పాకిస్తాన్ జరిగినట్లు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. కరాచీ, పీఓకేలోని ముజఫరాబాద్తో దాడికి సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు.
పాకిస్థాన్ కి సరైన బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగానే, కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకి సీసీఎస్ కీలక సమావేశం కానుంది.
Robert Vadra: పహల్గామ్ ఉగ్రదాడిపై యావత్ దేశం బాధతో ఉంటే, కొందరు నాయకులు మాత్రం రాజకీయాలు, హిందూ-ముస్లిం అంటూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. పహల్గామ్ దాడిని ప్రధాని నరేంద్రమోడీకి సందేశంగా ఆయన అభివర్ణించాడు. ‘‘ముస్లింలు బలహీనంగా ఉన్నారు’’ అనే వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mallikarjun Kharge: పహల్గామ్ ఉగ్రదాడి భారత దేశంపై దాడిగా భావించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్ర వాదులకు కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇవ్వాలి అని కోరారు. జాతీయ భద్రతపై కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అన్నారు.
Rajnath Singh: పహల్గామ్ ఉగ్రదాడిపై యావత్ భారతదేశం తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతోంది. పాకిస్తాన్కి, టెర్రరిస్టులకు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తోంది. హమాస్పై ఇజ్రాయిల్ దాడులు చేసిన విధంగా భారత్ దాడులు చేయాలని కోరుకుంటోంది. మంగళవారం కాశ్మీర్ చూసేందుకు వెళ్లిన టూరిస్టులపై లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
హల్గామ్ ఉగ్ర దాడితో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర టూరిజంపై తీవ్ర ప్రభావం పడింది. దీని వల్ల కాశ్మీరీల ఉపాధితో పాటు ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ దాడి జరగడంతో ఇక్కడికి వచ్చేందుకు టూరిస్టులు భయపడుతున్నారు. అయితే, ఇప్పటికే కశ్మీర్ కు బుక్ చేసుకున్న టికెట్లు రద్దు చేసుకున్నారు.
Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు టూరిస్టులపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. పర్యాటకుల్ని టార్గెట్ చేస్తూ మంగళవారం దాడికి పాల్పడ్డారు.
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మంగవారం ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 28 మంది మరణించారు. ఉగ్రవాదులు టూరిస్టుల్ని చుట్టుముట్టి కాల్చి చంపారు. ముఖ్యంగా, హిందువుల్ని టార్గెట్ చేశారు.
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన కీలక సూత్రధారులు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్ ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోరెన్సిక్, నిఘా, భద్రతా సంస్థల సంయుక్త దర్యాప్తులో ఆపరేషన్కి సంబంధించిన పాక్ ప్రమేయాన్ని సూచిస్తున్నాయి.
Pahalgam attack: పహల్గామ్ దాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి కొన్ని రోజులు ముందే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాశ్మీర్ తమ జీవనాడి అని, కాశ్మీర్ కోసం పోరాడుతున్నవారికి సాయం చేస్తామని చెప్పారు. పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతు ఉంటుందని చెప్పారు.