Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్ర ఘటనకు భారత్ పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. పాకిస్తాన్తో 1960లో చేసుకున్న ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అటారీ-వాఘా సరిహద్దును మూసేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో జరిగిన సీసీఎస్( భద్రతపై కాబినెట్ కమిటీ) సమావేశంల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.
పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడులకు వ్యతిరేకంగా జనసేన నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించింది. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “ఉగ్రవాదుల దాడిని రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ ఖండించాలి.. దేశంలో ఎన్ని మతాలు, కులాలు ఉన్నా కలిసి వెళ్లే సంస్కృతి మన పెద్దలు నేర్పారు.. Also Read:Pahalgam terror attack: ఉగ్రవాదుల…
పహల్గాం టెర్రర్ ఎటాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నలుగురు టెర్రరిస్టులు కాశ్మీర్లోని పహల్గాం ఏరియాలో ఒక లోయను టార్గెట్గా చేసుకుని సుమారు 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఐడీ కార్డులు చెక్ చేసి మరి ముస్లిమేతరులను కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కల్లోలం రేకెత్తిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ అంశంలోకి ప్రభాస్ హీరోయిన్ అనూహ్యంగా చిక్కుకుంది. అసలు విషయం ఏమిటంటే, ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి…
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాది యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. ఈ ఉగ్రదాడిలో మొత్తం 28 మంది అమాయకపు టూరిస్టులు ప్రాణాలు వదిలారు. నలుగురి నుంచి 6 మంది వరకు టెర్రరిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురిని భద్రతా సంస్థలు గుర్తించాయి.
Danish Kaneria: పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా ఆగ్రహం సొంత దేశంపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పాకిస్తాన్ తరుపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అతికొద్ది మంది హిందూ ఆటగాళ్లలో కనేరియా ఒకరు. మంగళవారం జరిగిన ఉగ్ర ఘటనపై ఆయన మరోసారి స్పందించారు.
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించారు. ఈ సంఘటనను దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. పలు దేశాధినేతలు మృతులకు సంతాపం తెలియజేశారు. ఈ కష్టకాలంలో భారత్కి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని ప్రతి భారతీయుడు రగిలిపోతున్నాడు. ఉగ్రమూకల దాడిని ప్రపంచ దేశాధినేతలు ఖండిస్తున్నారు. ఉగ్రవాదులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది టూరిస్టులు మృత్యువాత పడిని విషయం తెలిసిందే. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా వైసీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. Also Read:Pahalgam Terror Attack: పహల్గామ్ దాడుల ప్రధాన సూత్రధారి సైఫుల్లా కసూరి..! తాడేపల్లి పార్టీ…
Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడికి భారతదేశం కన్నీరు కారుస్తోంది. అమాయకులైన టూరిస్టుల్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో మరణించారు. మరోవైపు, ఈ దాడికి పాల్పడింది తామే అని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ప్రకటించింది. దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆధారాలు సేకరించాయి.
Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి వెనుక పాక్ లష్కరే (LET) కమాండర్ సైఫుల్లా కసూరి పేరు బయటకు వచ్చింది. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్కు ఇతడు అత్యంత సన్నిహితుడిగా పేరుంది.
పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు ఓ నవ జంట జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన వారం రోజుల్లోనే కన్నీళ్లను మిగిల్చింది. ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో భర్త ప్రాణాలు కోల్పోయాడు. కళ్ల ముందే భర్త చనిపోవడంతో నవ వధువు గుండెలు పగిలేలా రోధించింది. హనీమూన్ కోసం వెళితే ప్రాణాలే పోయాయి. మృతదేహాన్ని ఇంటికి చేర్చారు అధికారులు. నేవీ అధికారి భార్య శవపేటికకు సెల్యూట్ చేసి వీడ్కోలు పలికింది. “జై హింద్”…