Pakistan: పాకిస్తాన్ భారత్‌తో యుద్ధానికి దిగేందుకే ‘‘పహల్గామ్ ఉగ్ర దాడి’’కి పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక దేశాన్ని, దేశ ప్రజల్ని ఏకం చేయాలంటే ‘‘యుద్ధం’’ని మించిన మార్గం లేదని పాకిస్తాన్ భావిస్తోంది. ముఖ్యంగా, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ భారత్‌తో చిన్న పాటి ఘర్షణను కోరుకుంటున్నారు. ఎందుకంటే, ఇటీవల కాలంలో ఆసిమ్ మునీర్ తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. బెలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ సైన్యాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), పాక్ తాలిబాన్లు పచ్చడిపచ్చడి చేస్తున్నాయి.…