టాలీవుడ్ సీనియర్ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ లు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం స్వీకరించిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. బాలయ్యకు అభినందనలు తెలియజేస్తూ ” హిందూపురం శాసన సభ్యులు, ప్రముఖ కథానాయకులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ‘పద్మభూషణ్’ పురస్కారం స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శ్రీ బాలకృష్ణ గారికి ప్రత్యేక స్థానం…