Arekapudi Gandhi: నువ్వు 11 గంటలకు వస్తా అన్నావు రాకుంటే నీ ఇంటికి వస్తా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి అరికెపూడి గాంధీ ప్రతిసవాల్ విసిరారు. దీంతో ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ మహిళా నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేషన్ ఛైర్మన్ శోభా రాణి మాట్లాడుతూ.. పాడి కౌశిక్ రెడ్డి…చీరలు.. గాజులు వేసుకునే వాళ్ళు ఎవరూ చేతకాని వాళ్ళు కాదని విరుచుకుపడ్డారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని, గాజులు పెట్టుకునే వాళ్ళు చేతకాని వాళ్ళు అనుకుంటే నీ ఇంట్లో బిడ్డా.. భార్య ఉందని ఆమె అన్నారు. మహిళలను అడ్డుపెట్టుకుని గెలిచిన చరిత్ర…
బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. జాప్యం చేస్తే కోర్టు ధిక్కారంతో సమానమని, సుమోటోగా హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. BRS శాసనసభ్యులు బుధవారం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారితో సమావేశమై అసెంబ్లీ స్పీకర్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఒత్తిడి చేశారు. తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాకుండా ఇకపై తమ…
Ambati Rayudu declines BRS MLA Padi Kaushik Reddy’s Request: షూటర్ ఇషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌లకు హైదరాబాద్‌లో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడానికి తెలంగాణ కేబినెట్ ఇటీవలే అంగీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వాగతించారు. అంతేకాదు మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓఝా, అంబటి రాయుడు.. బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకు…
Padi Kaushik Reddy: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలంగాణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై హుజురాబాద్ బీఆర్ఎస్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దానం నాగేందర్ మాటలు చెప్పరాకుండా ఉన్నాయని మండిపడ్డారు.
అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు, కాంగ్రెస్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో తమ అధికారిక పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. వారు స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు బాధ్యులైన అధికారులపై ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయాలని ప్రయత్నించారు , కాని వారి ఫోన్ కాల్‌లకు వారు స్పందించిన తర్వాత వారు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ.. .స్పీకర్ ను కలవడానికి అసెంబ్లీకి వచ్చామని,…
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంగళవారం పరస్పరం వాదించుకున్న బీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతలు బుధవారం పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో ఎం.శ్రీనివాస్ తనను అవమానపరిచారని, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా కౌశిక్ రెడ్డిపై చిగురుమామిడి జెడ్పీటీసీ, జెడ్పీ ఫ్లోర్ లీడర్ గికురు రవీందర్ తనను చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. అధికారులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు…
BRS MLA Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. బీఎన్ఎస్ యాక్టులో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావడం విశేషం.
కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ లో కల్యాణ లక్ష్మీ చెక్కులని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్ద పోరాటంతో శాసనసభ్యునిగా కోర్టులో జీవో తో కమలాపూర్ మండలంలో 80 మందికి చెక్కులు పంచామన్నారు. దయచేసి నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి.కానీ నా నియోజకవర్గ ప్రజల మీద తీర్చుకోకండని, నా ప్రజల జోలికి వస్తే ఎంత వరకైనా వస్తా.ఊరుకునేది లేదన్నారు. ఈ చెక్కులు కేసీఆర్ ఇచ్చిన…
Kaushik Reddy: బుధవారం 11 గంటలకు జూబ్లి హిల్స్ టిటిడి టెంపెల్ దగ్గరకు మంత్రి పొన్నం ప్రభాకర్ రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.