విశాఖ మన్యంలో మావోయిస్టుల తాజా లేఖ కలకలం రేపుతోంది… అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ లేఖ రాశారు మావోయిస్టులు.. లేట్రైట్ మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలకు ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. జీకే వీధి మండలం చాపరాతి పాలెంలో జరుగుతున్న మైనింగ్‌ను తరిమి కొట్టాలని లేఖ విడుదల చేశారు.. పార్టీలకు పదవులకు రాజీనామా చేసి మన్యం విడిచిపోవాలని లేఖలో డిమాండ్ చేసింది మావోయిస్టు పార్టీ…
ఆ యంగ్ ఎమ్మెల్యేకు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు షాక్ ఇస్తున్నాయా? రెబల్స్ వర్సెస్ ఎమ్మెల్యే వార్ హోరెత్తుతోందా? విపక్షం స్పీడ్ పెంచడంతో.. ఇంటా, బయటా ఉక్కిరి బిక్కిరి తప్పడం లేదా? ఇంతకీ ఈ కుమ్ములాటలకు కేంద్రం ఎక్కడుంది? ఏంటా పంచాయితీ? పాడేరు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు..! విశాఖ జిల్లాలో ఎస్టీ రిజర్డ్వ్ నియోజకవర్గమైన పాడేరు మన్యం ప్రాంత రాజకీయాలకు కేంద్ర బిందువు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ వ్యక్తుల కంటే పార్టీ ఆధారంగా ఫలితాలు వచ్చాయి. 2014లో…