అన్నదాత కడుపు మండుతోంది. నారు పోసి, ఆరుగాలం కష్టాలు పడి పంట పండిస్తే కొనేవారు లేక రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. సొసైటీ కి తాళం వేసి నిరసన తెలిపారు. ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి తాళం వేసి నిరసన తెలిపారు రైతులు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు నెమ్మదిగా కొనసాగుతోందని ఆరోపించారు. అకాల వర్షాలతో రోజు రోజుకి…
వానాకాలం వరి ధాన్యాన్ని ఎంతకొంటామనే విషయంపై కేంద్రం ఎటూ తేల్చలేదు. యాసంగి లో పండే బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని ఖరాఖండి గా తేల్చిచెప్పింది కేంద్రం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలతో న్యూ ఢిల్లీలో మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్., కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ లతో విడి విడిగా దాదాపు మూడున్నర గంటల పాటు సుధీర్గంగా చర్చించారు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఉన్నతాధికారుల బృందం. రాష్ట్రం నుంచి…
తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ సోయం బాపురావ్. ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ఓటమి తట్టుకోలేక వరి ధాన్యం పై రాద్దాంతం చేస్తున్నారని, కేంద్రం వరి ధాన్యం కొనము అని ఎక్కడా చెప్పలేదన్నారు. టీఆర్‌ఎస్ నేతలు బజార్ రౌడీల్లా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీని బదనాం చేయడం కోసం తప్ప రైతులకు మేలు చేసే ఆలోచన టీఆర్ఎస్ కు లేదు. రైతుల మీద ప్రేమ…