సాగు సమస్యలు పరిష్కారం కాక … అష్ట కష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఈ ఖరీఫ్ లో క్రాప్ హాలీడే పాటిస్తే కనీసం పెట్టుబడి డబ్బులు అయినా మిగులుతాయని కోనసీమ వరి రైతులు పంట విరామానికే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కోనసీమ జిల్లాలోని ఐ.పోలవరం, అల్లవరం మండలాల రైతులు గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్రాప్ హాలీడే పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని 12 మండలాల్లోని రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్…
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. బిల్లులు చెల్లించాలని పోరాడుతున్న విజయనగరం చెరకు రైతులపై కేసులు నమోదు చేసి నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ అహంకార ధోరణే. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రకృతి వైపరీత్యాల వలన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. వ్యవసాయ రంగం పట్ల నిర్లక్ష్యం, ధాన్యం బకాయిలు, పంట నష్ట పరిహారం రాకపోవడం, రైతుకి ఉపయోగం లేని ఆర్బీకే సెంటర్ల కారణంగా రైతులు అనేక సమస్యలు…