Ozone Hole: 2019-20 ఆస్ట్రేలియాలో ఏర్పడిన కార్చిచ్చు వల్ల ఓజోన్ పొర రంధ్రం విస్తరించినట్లు తాజా అధ్యయాల్లో తేలింది. ఆగ్నేయాస్ట్రేలియాలో దాదాపుగా నెల రోజల పాటు కార్చిచ్చు ఏర్పడింది. వేల హెక్టార్లలో అడవులు ధ్వంసం అయ్యాయి. ఈ భారీ కార్చిచ్చు విడుదలైన వాయువులు ఓజోన్ పొర పలుచగా మారేందుకు కారణం అయ్యాయి. 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి వరకు ఈ కార్చిచ్చు విస్తరిస్తూనే ఉంది.
Ozone Depletion: భూమిపై వాతావరణం వేగంగా మారుతోంది. పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రతల కారణంగా కాలాల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మానవుల అభివృద్ధి భూమిని రక్షించే ఓజోన్ లేయర్ ను దెబ్బతీస్తోంది. ఇప్పటికే క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ లేయర్ క్షీణిస్తోంది. అయితే తాజాగా మరో మూలకం ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. అంతర్జాతీయ పరిశోధకులు బృందం ఆర్కిటిక్ ప్రాంతంలో పరిశోధన చేస్తున్న సమయంలో ఈ కొత్తగా అయోడిన్ మూలకం కూడా ఓజోన్ పొరను దెబ్బతీస్తుందని…