తమిళనాడు కోయంబత్తూర్ ఆస్పత్రి ఆవరణలో పార్క్ చేసిన అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు పేలుడు సంభవించింది. సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా పొగలు, మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆక్సిజన్ సిలిండర్లు ఎలా పేలాయన్నదానిపై ఆస్పత్రి వర్గాలు విచారణ ప్రారంభించాయి.
మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి పాలసీ 2021-22ను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం ఉన్న 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 700 మెట్రిక్ టన్నులకు పెంచటమే ఉద్దేశ్యంగా ఈ పాలసీని ప్రారంభించారు. రాష్ట్రంలో 50 పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పాలసీ రూపుదిద్దుకుంటోంది. ముందుకు వచ్చే ఆక్సిజన్ ఉత్పత్తిదారులకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. పెట్టుబడిలో 30 శాతం వరకు సబ్సిడీ కూడా ఇవ్వనుంది. అలాగే విద్యుత్ యూనిట్ కు…
కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్ ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి చెప్పారు. తెలంగాణకు ప్రస్తుతం ఇస్తున్న 5,500 రెమిడెసివిర్ల ఇంజక్షన్ల సంఖ్యను, సోమవారం నుంచి 10,500 కి పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి సీఎంకు తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో అదనంగా…
ఆక్సిజన్ సంక్షోభం అంచున తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఉంది. ఆసుపత్రికి పంపే ఆక్సిజన్ లో కోత విధించాల్సిందిగా సరఫరాదారును ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం. 15 ఏళ్లుగా తమిళనాడులోని ఎయిర్ వాటర్ కంపెనీ నుంచి స్విమ్స్ కి ఆక్సిజన్ వస్తుండగా.. రెండు విడతలుగా రోజుకు 14 కేఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం 8కేఎల్ కి మించి ఆక్సిజన్ పంపించలేమని స్విమ్స్ కి తేల్చి చెప్పారు గుత్తేదారు. ప్రస్తుతం స్విమ్స్ లో 467మంది కోవిడ్ రోగులు…