Bengaluru : గార్డెన్ సిటీగా పేరొందిన కర్ణాటక రాజధాని బెంగుళూరు శివారుల్లో రోడ్లపై చిరుతలు సంచరిస్తున్నాయి. ఔటర్ బెంగళూరు సమీపంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ రోడ్డు గుండా వెళ్లాలంటేనే వాహనదారులు హడలెత్తుతున్నారు. బెంగళూరు పరిసరాల్లోని తురహళ్లి అటవీప్రాంతం నుంచి ఇది వెలుపలికి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. రెండ్రోజుల కిందట ఈ చిరుత కెంగేరి ప్రాంతంలో కనిపించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ఏరియాలో భారీ కేజ్‌లను ఏర్పాటు చేశారు.
Read Also: ShareChat : షేర్చాట్లో ఉద్యోగాల కోత.. మూతపడనున్న స్పోర్ట్స్ యాప్
అయితే చిరుత జింకను వేటాడిన ఆనవాళ్లు కూడా లభించాయి. గత రెండు రోజుల నుంచి తురహళ్లి ఫారెస్ట్ సమీప ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా బెంగళూరు సిటీ డిప్యూటీ కన్జర్వేటర్ ఎస్ఎస్ రవి శంకర్ మాట్లాడుతూ.. చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. బన్నేరగట్ట నేషనల్ పార్కుతో పాటు ఫారెస్టు దగ్గరగా ఉండటంతో చిరుత సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఏరియాలో కేవలం ఒక చిరుత మాత్రమే ఉందన్నారు. కొందరు నాలుగు చిరుతలు సంచరిస్తున్నట్లు వైరల్ చేస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.