ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన 'ఆర్గానిక్ మామ - హైబ్రిడ్ అల్లుడు' చిత్రం మార్చి 3న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర బృందం పాల్గొని సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేసింది.
తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు పూర్తి అయినా, 'దిల్' రాజు, సి. కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ కు ఫుల్ స్టాప్ పడినట్టు కనిపించడం లేదు... వీరిద్దరి సినిమాలు వచ్చే నెల 3వ తేదీ బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగుతున్నాయి.
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఇప్పుడు మాటల రచయితగానూ మారిపోయారు. తన తాజా చిత్రం 'ఆర్గానిక్ మామ - హైబ్రీడ్ అల్లుడు'కు ఆయనే సంభాషణలు సమకూర్చుకున్నారు. ఈ సినిమా మార్చిలో జనం ముందుకు రాబోతోంది.
సీనియర్ డైరెక్టర్స్ చాలామంది దుకాణం సర్దేసుకున్నారు. కొందరైతే తమ శిష్యులు తీస్తున్న సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒక్కసారి మెగా ఫోన్ పట్టుకున్న తర్వాత వదిలేది లేదని భావిస్తున్న కొందరు సీనియర్స్ మాత్రం సమయం దొరికినప్పుడల్లా కథలు తయారు చేసుకుంటూ, తాజాగా మరోసారి తమ సత్తా చాటడానికి స