Parliament Winter Session: నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడో రోజు జరిగాయి. తొలిరోజు సంభాల్ హింసాత్మక ఘటనపై, భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై చర్చించేందుకు ప్రతిపక్షాలు వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చాయి. విపక్షాల ఆందోళనతో సభా కార్యక్రమాలు కొనసాగలేదు. రెండవ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, పార్లమెంటులోని చారిత్రక సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఇక నేడు మూడో రోజు బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024ను లోక్‌సభలో…
వక్ఫ్ (సవరణ) బిల్లుపై దర్యాప్తు చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఛైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశాయి. తాము జేపీసీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని విపక్ష ఎంపీలు హెచ్చరించారు. లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును పరిశీలించే బాధ్యతను జగదాంబిక పాల్ నేతృత్వంలోని జేపీసీకి అప్పగించిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశానికి ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. భేటీ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. సమావేశంలో చర్చలు చాలా సహృదయపూర్వకంగా జరిగాయన్నారు. ఈ స్వల్పకాలిక సమావేశంలో ప్రతి అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.