శుక్రవారం బీహార్‌లోని పాట్నాలో నాలుగు గంటలపాటు జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 32 మంది నాయకులు హాజరయ్యారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సమా నిర్ణయించుకున్నారు.
Opposition Meet: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీని పదవి నుంచి దింపేయాలన్న లక్ష్యంతో బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం 15 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ పార్టీలన్నీ ఒకే గొంతుకలో కలిసి ఎన్నికల్లో పోరాడతామని చెప్పారు.
Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం జమ్మూ కాశ్మీర్ లో తన రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు. కాశ్మీర్లో డెవలప్మెంట్ గురించి ఆయన ప్రస్తావించారు. బీజేపీ సిద్ధాంతకర్త, భారతీయ జన సంఘం వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు. సాంబాలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్సెస్ లాబొరేటరీకి శంకుస్థాపన చేసిన తర్వాత సాయంత్రం శ్రీనగర్‌కు వెళ్లి అక్కడ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించే వితస్తా ఫెస్టివల్‌లో పాల్గొని అనంతరం భద్రతా సమీక్షా సమావేశం…
Rahul Gandhi: పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో జరుగుతున్న విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. పాట్నా చేరుకున్న వీరిద్దరు అక్కడి కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధిస్తామని.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ కనిపించకుండా చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. పేదల పక్షాన కాంగ్రెస్ నిలబడుతోందని.. ఇద్దరుముగ్గురు కోసమే బీజేపీ పనిచేస్తుందని విమర్శించారు.
Opposition Meeting: జాతీయ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన నేడు విపక్షాల సమావేశం జరగబోతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అడ్డుకోవడమే ధ్యేయంగా ఈ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాట్నా చేరుకున్నారు.
Mamata Banerjee: బీజేపీ వ్యతిరేక పార్టీల సమావేశంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాట్నా చేరుకున్నారు. పాట్నా చేరుకున్న తర్వాత, ఆమె నేరుగా తేజస్వి యాదవ్ అధికారిక నివాసం పంచ్ దేశరత్న మార్గ్‌కు చేరుకుంది.
ఇప్పుడు చర్చ మొత్తం రాష్ట్రపతి ఎన్నికలపైనే.. అధికార కూటమి అభ్యర్థి ఎవరు? అనే చర్చ ఓవైపు జరుగుతుంటే.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు? అనే విషయాలపై విశ్లేషణలు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. ఈ నేపథ్యంలో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నిక లేకుండా ఏకగ్రీవం ద్వారా తమ రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించుకోవాలని అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎన్డీయే ఎవరిని పెట్టినా కూడా…
రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు దేశరాజకీయాల్లో కాకరేపుతున్నాయి. సరైన అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో అధికార, విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బీజేపీయేతర ముఖ్యమంత్రులతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అవుతున్నారు. అయితే ఆమెతో భేటీకి పలువురు సీఎంలు సిద్ధంగా లేనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ నిర్వహించనున్న సమావేశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి సంబంధించి నిన్నటి వరకు కూడా తమకు ఎలాంటి ఆహ్వానం…
రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడింది.. ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇవాళ్టి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.. మరోసారి ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు విపక్షాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందులో భాగంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ఢిల్లీ వేదికగా కీలక సమావేవాన్ని ఏర్పాటు చేశారు.. బీజేపీయేతర పక్షాలకు చెందిన 20 మందికి పైగా నేతలకు…