తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. రుణమాఫీపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట అమలు చేశామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రుణమాఫీ చేశామన్నారు.
రాజ్యాంగంపై చర్చకు బీజేపీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. లోక్‌సభలో జరిగే ఈ చర్చలో ప్రధాని మోదీ కూడా పాల్గొని సమాధానం ఇవ్వనున్నారు. డిసెంబర్ 13-14 తేదీల్లో లోక్‌సభలో, డిసెంబర్ 16-17 తేదీల్లో రాజ్యసభలో ఈ చర్చ జరగనుంది. రాజ్యాంగం పట్ల తమకున్న నిబద్ధతను ప్రదర్శించి ప్రతిపక్షాలపై దాడి చేయడమే బీజేపీ లక్ష్యం