Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో కిష్త్వార్ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం మధ్యాహ్నం నుంచి కాల్పులు ప్రారంభయ్యాయి. సైన్యానికి చెందిన ఏడుగురు సైనికులు ఈ ఆపరేషన్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. కఠిమైన పర్వత ప్రాంతాల్లో దాగి ఉన్న ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి.