అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్ మద్దతు ఉన్న ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ (OSF) సంస్థతో పాటు బెంగళూరులోని కొన్ని అనుబంధ సంస్థలలో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనలపై దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సోదాలు విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కింద జరుగుతున్నాయని, ఓఎస్‌ఎఫ్ తో పాటు కొన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా ఇందులో పాల్గొన్నాయని అధికారులు…
Bangladesh: అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుమారుడు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్(ఓఎస్ఎఫ్) ఛైర్‌పర్సన్ అలెక్స్ సోరోస్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌ని కలవడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్‌కి ఆర్థిక సాయాన్ని ఆపేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. గత అక్టోబర్ నెలలో సోరోస్, యూనస్ కలిశారు. తాజాగా వీరిద్దరు రెండోసారి కలుసుకున్నారు.