రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. సెక్రటేరీయేట్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. రెండో విడత అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్, గుంటూరు జెడ్పీ ఛైర్ పర్సన్, గుంటూరు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అన్న క్యాంటీన్లల్లో టోకెన్లు తీసుకుని పేదలకు ఇచ్చారు సీఎం చంద్రబాబు. అనంతరం.. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పేదలకు భోజనం వడ్డించారు.
అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ (AMGEN) తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఉంటుంది. దాదాపు 3 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాన్ ఫ్రాన్సిస్కోలోని…
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు అనంతరం మధ్యాహ్నం 1.28 గంటలకు రహస్య గదిని తెరిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల కమిటీ సభ్యులు ఈరోజు మధ్యాహ్నం జగన్నాథుని ఆలయంలోకి ప్రవేశించి ఖజానాను తెరిచారు.
శివ భక్తుల నిరీక్షణ ఫలించింది. శుక్రవారం కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి. ఉదయం 7.10 గంటలకు కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేదార్‌నగరి 'జై కేదార్' నినాదాలతో మారుమోగింది. ఈరోజు అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు కేదార్‌నాథ్ దర్శనం కోసం తరలివచ్చారు.
అబుదాబి (Abu Dhabi)లో ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించిన తొలి హిందూ దేవాలయం మార్చి 1 నుంచి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి రానున్నట్లు బీఏపీఎస్(BAPS) సంస్థ తెలిపింది.
కేరళలోని శబరిమల క్షేత్రంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి.. నవంబర్ 17 (శుక్రవారం) నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఈ ఏడాది శబరిమల వార్షిక వేడకలకు సిద్ధమైంది. నవంబర్ 17 నుంచి మండల మకరవిళక్కు వేడుకలు ప్రారంభం కానుండగా.. రెండు నెలలపాటు స్వామివారి మహాదర్శనం కొనసాగనుంది. అందుకు సంబంధించి కేరళ దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి రాధాకృష్ణ తెలిపారు.