కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ దిగ్గజ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఊమెన్ చాందీ బెంగళూరులో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చాందీ ఊమెన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 1943 అక్టోబర్ 31న ఊమెన్ చాందీ కొట్టాయం జిల్లా పుతుప్పల్లిలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఊమెన్ చాందీ.. రెండుసార్లు కేరళకు సీఎంగా పని…