ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో సమంత సాంగ్ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ‘ఊ అంటావా మావ ఉఊ అంటావా’ అంటూ సామ్ చేసిన ఈ ఐటమ్ సాంగ్ విడుదలైనప్పటి నుంచి యూట్యూబ్ లో భారీ వ్యూస్, లైకులతో దూసుకెళ్తోంది. అయితే ఈ సాంగ్ లో సామ్ హాట్ నెస్ కు యూత్ కు మ్యాడ్ నెస్ వచ్చేసిందని చెప్పాలి. అంతలా ఊపేసిన ఈ సాంగ్ లిరిక్స్ కొంతమంది మగజాతి ఆణిముత్యాలను హర్ట్…