ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో సమంత సాంగ్ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ‘ఊ అంటావా మావ ఉఊ అంటావా’ అంటూ సామ్ చేసిన ఈ ఐటమ్ సాంగ్ విడుదలైనప్పటి నుంచి యూట్యూబ్ లో భారీ వ్యూస్, లైకులతో దూసుకెళ్తోంది. అయితే ఈ సాంగ్ లో సామ్ హాట్ నెస్ కు యూత్ కు మ్యాడ్ నెస్ వచ్చేసిందని చెప్పాలి. అంతలా ఊపేసిన ఈ సాంగ్ లిరిక్స్ కొంతమంది మగజాతి ఆణిముత్యాలను హర్ట్ చేయడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. లిరిక్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడటంతో సాంగ్ వివాదాస్పదమైంది. అయితే అది కూడా ఒక రకంగా సినిమా పబ్లిసిటీకి ఉపయోగపడిందని చెప్పాలి. కానీ సామ్ అభిమానులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా సాంగ్ ను ఎంజాయ్ చేశారు. కాగా సామ్ ఐటమ్ సాంగ్ చేయడం ఇదే మొదటిసారి.
Read Also :
తాజాగా సాంగ్ గురించి సామ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘పుష్ప’ మూవీలోని ఈ సాంగ్ కు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేస్తూ ‘నేను బాగా డ్యాన్స్ చేశాను. ఫన్నీగా, సీరియస్ కనిపించాను. నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో రాణించడానికి శ్రమిస్తున్నాను. కానీ సెక్సీగా ఉండటానికి దానికి మించిన స్థాయిలో హార్డ్ వర్క్ చేయాలి. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ఈ సాంగ్ కు తాను ఎంత కష్టపడిందో వెల్లడించింది. ఇక ఈ సాంగ్ చేయడానికి సామ్ ముందుగా అంగీకరించలేదట. కానీ డైరెక్టర్ సుకుమార్ స్టార్ హీరోయిన్లు కూడా సినిమాలు చేస్తున్నారు అంటూ నచ్చజెప్పడంతో అడుగు ముందుకేసిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ స్వయంగా వెల్లడించాడు.