ఈ వీకెండ్ తెలుగులో ఓ అనువాద చిత్రంతో కలిపి మొత్తం ఐదు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో రెండు సినిమాలు శుక్రవారం, మూడు చిత్రాలు శనివారం రిలీజ్ కాబోతున్నాయి.
యస్వంత్ , జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ప్రధాన తారాగణంగా సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. దీనికి తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మాత. ఈ సినిమా రెండు పాటల మినహా పూర్తయ్యింది. బాలెన్స్ ఉన్న ఆ రెండు పాటలను కశ్మీర్ లో చిత్రీకరించబోతున్నారు. వీటి షూటింగ్ నిమిత్తం యూనిట్ కశ్మీర్ వెళుతున్న సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ లో మీడియా…