CM Chandrababu: పార్టీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పలువురికి ఆర్థిక సాయం నిధులు చేశారు. అనంతరం నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించారు. అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్‌చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై పూర్తి అప్రమత్తతో ఉన్నామన్నారు.
Minister Anitha: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత పులివెందుల, ఒంటిమిట్ట జెడ్‌పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బాబాయ్‌ను చంపిన వారికి ఓటు వేయాలా? తల్లికి, చెల్లికి ఆస్తి పంచకుండా కోర్టుకు వెళ్లిన వ్యక్తికి ఓటు వేయాలా? అంటూ ప్రశ్నించారు. అలాగే మంత్రి అనిత మాట్లాడుతూ.. పులివెందులలో ఎన్నికలు ఎప్పుడూ భయపెట్టి, ఏకపక్షంగా జరిపే చరిత్ర ఉందని ఆమె పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌ల మార్పు నిర్ణయం ఎన్నికల కమిషన్‌దే తప్ప ముఖ్యమంత్రిది…