ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అవుతుంది.. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం..ఆన్‌లైన్లో సినిమా టికెట్లు అమ్మకం, సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేసే అర్డినెన్సుకు అమోదం తెలిపే అంశంపైనా చర్చించే ఛాన్సుంది. ఇక, దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయశాఖ చట్టసవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీవింగ్ ఏర్పాటుపై చర్చించనుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ…
తెలుగు చిత్ర పరిశ్రమను రెండు ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ ఆదివారం సాయంత్రం లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేది మా సినిమా ఇండస్ట్రీ అని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈ రోజు సంక్షోభంలో పడిపోయింది. ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను కనికరించాలని.. తమ అభ్యర్థనను మన్నించాలని చిరు కోరారు. అయితే తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు.. సినీ నిర్మాతలు..…
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, ఏపీ మంత్రి పేర్నినానితో జరిపిన సమావేశం ముగిసింది. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, సి.కల్యాణ్, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు పాల్గొన్నారు. నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం నుంచి మంచి భరోసా లభించింది. ఆన్ లైన్ టిక్కెటింగ్ కావాలని మేమే అడిగాము. ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఊతం ఇచ్చారు’ అని సి.కళ్యాణ్ తెలిపారు. నిర్మాత…