ముఖ్యమంత్రి స్పీచ్ అద్భుతంగా ఉందని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. రెండు గంటల 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ స్పీచ్‌పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి స్పీచ్‌లో అప్పులు, వడ్డీ లెక్కలు స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్పారని కొనియాడారు.