హైదరాబాద్ కృష్ణానగర్‌లో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. తరగతి గదిలో సరదాగా ఆడుకున్న ఆట ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణానగర్‌లోని సాయికృప హైస్కూలులో పదో తరగతి విద్యార్థులు పేపర్ బాల్‌తో క్రికెట్ ఆడుకున్నారు. ఈ క్రమంలో ఆటలో భాగంగా విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో విద్యార్థులు ఘర్షణ పడ్డారు. నలుగురు విద్యార్థులు ఒకరినొకరు తోసుకున్నారు. బౌలింగ్ సరిగా చేయడం లేదంటూ తోటి విద్యార్థులు మన్సూర్‌పై దాడి చేయగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి.…