గత రెండు సంవత్సరాలుగా భారత్‌తో పాటు యావత్త ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. అయితే మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా రక్కసి గత కొన్ని రోజుల నుంచి మరోసారి విజృంభిస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీ పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల క్రితం భారత్‌లో 50 వేల లోపు నమోదైన కరోనా కేసులు, తాజాగా లక్షకుపైగా నమోదయ్యాయి. ఇలా రెట్టింపు…
ఇప్పుడు ప్రపంచ దేశాలకు కరోనా మహమ్మారి పెద్ద సవాల్‌గా మారుతోంది.. ఓవైపు క్రమంగా డెల్టా, డెల్టా ప్లస్ కేసులు పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తుంటే.. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా టెన్షన్ పెడుతోంది.. క్రమంగా కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.. ఇదే సమయంలో ఒమిక్రాన్ మృతుల సంఖ్య కూడా పెరుగుతూ కలవరానికి గురిచేస్తోంది.. ఒమిక్రాన్‌పై మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). Read Also: కీచక రాఘవ…
భారత్‌లో మళ్లీ కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది… గత నాలుగైదు రోజులుగా భారీ సంఖ్యలో రోజువారి కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. ఇక, ఇవాళ ఏకంగా లక్ష మార్క్‌ను దాటేసి మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,17,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, మరో 302 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు. దీంతో.. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కోవిడ్…
అనుకున్నంతా అయ్యింది! తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ‘వలిమై’ నిర్మాత బోనీ కపూర్ తన సినిమా విడుదలను వాయిదా వేశారు. నిజానికి సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించినప్పటి నుండే అందరిలోనూ ఇది వాయిదా పడే ఛాన్స్ ఉందనే అనుమానం కలిగింది. ఓ పక్క కరోనా కేసులు పెరగడంతో పాటు తమిళనాడులో రాత్రి కర్ఫ్యూ పెట్టడం, ఆదివారం లాక్ డౌన్ ప్రకటించడంతో సహజంగానే స్టార్ హీరో…
ఈ సంక్రాంతికి ఒకే ఒక్క టాప్ స్టార్ నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ జనం ముందుకు వస్తోంది. జనవరి 14న ‘బంగార్రాజు’ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సినిమాలో నాగార్జున నటవారసుడు నాగచైతన్య సైతం నటించడం విశేషం. కాగా, వీరిద్దరూ కలసి ఇంతకు ముందు నటించిన ‘మనం’ అప్పట్లో ఘన విజయం సాధించిది. ఇక నాగార్జున తరం హీరోలతో పోలిస్తే సంక్రాంతి సంబరాల్లో ఆయన తక్కువగానే పాల్గొన్నారని చెప్పాలి. అయితే 2016లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో పొంగల్ బరిలోకి దూకి,…
దేశంలో ఒమిక్రాన్ కారణంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు మళ్లీ పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టాక కొన్ని ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌ను ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ ముప్పు పెరుగుతుండటంతో ఆయా సంస్థలు మళ్లీ ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేశాయి. సోమవారం నుంచే కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పనిచేయటం ప్రారంభించగా… బుధవారం…
భారత్‌లో కరోనా సునామీ మొదలైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. బుధవారం 58000 కరోనా కేసులు నమోదు కావటం తీవ్రతను తెలియజేస్తోంది. గత తొమ్మిది రోజులతో పోలిస్తే కేసులు ఆరు రెట్లు పెరిగాయి. రాబోవు కాలంలో ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అంచనా వేయటం కూడా కష్టమే. మరోవైపు, దేశంలో ఒమిక్రాన్ కేసులు రెండు వేలకు దగ్గరయ్యాయి. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విదేశీ ప్రయాణికులలో ఎక్కువగా ఒమిక్రాన్ కేసులే ఉంటున్నాయి. థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు కట్టడి…
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆంక్షల దిశగా వెళ్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు ఆదివారం రోజున పూర్తి లాక్ డౌన్‌ను ప్రకటించింది. ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తునే ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ముప్పు తప్పదని ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కాగా తాజాగా ఏపీలోనూ మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. Read Also: షాహినాయత్ గంజ్‌లో కల్తీ నెయ్యి…
ఏపీలో క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో బుధవారం మధ్యాహ్నం మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరితో పాటు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి నుంచి మరో మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది. Read Also: పావురం కాలికి చైనా ట్యాగ్……
అటు దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ… ఏపీలోనూ ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. మంగళవారం నాడు రాష్ట్రంలో కొత్తగా ఏడుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యశాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. తాజాగా ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు ఒమన్ నుంచి, ఇద్దరు యూఏఈ నుంచి వచ్చారు. అమెరికా నుంచి ఒకరు, దక్షిణ సూడాన్ నుంచి ఒకరు, గోవా నుంచి ఒకరు ఏపీకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. Read Also: శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు..…