97 ఏళ్ల వయసులో ఓ బామ్మ చేసిన సాహసం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఆకాశంలో ఎగరాలనుకున్న తన కలను సాకారం చేసుకున్నారు. ఫ్లయింగ్ రైనో పారామోటరిగ్ అనే ఇన్‌స్టా పేజ్ బామ్మ వీడియోను షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బామ్మ ధైర్యానికి నెటిజన్లు మాత్రమే కాదు.. ఏకంగా వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రానే సర్‌ప్రైజ్ అయ్యారు. దీంతో ఈ బామ్మ వీడియో షేర్ చేస్తూ నా హీరో…