97 ఏళ్ల వయసులో ఓ బామ్మ చేసిన సాహసం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఆకాశంలో ఎగరాలనుకున్న తన కలను సాకారం చేసుకున్నారు. ఫ్లయింగ్ రైనో పారామోటరిగ్ అనే ఇన్‌స్టా పేజ్ బామ్మ వీడియోను షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బామ్మ ధైర్యానికి నెటిజన్లు మాత్రమే కాదు.. ఏకంగా వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రానే సర్‌ప్రైజ్ అయ్యారు. దీంతో ఈ బామ్మ వీడియో షేర్ చేస్తూ నా హీరో అంటూ ప్రశంసలు కురిపించారు. ఇంతకి ఆ బామ్మ చేసిన సాహసం ఏంటంటే.. ఈ బామ్మ ప్లయింగ్ రైనోలో ద్వారా ఆకాశాన్ని చూట్టోచ్చే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు.
Health Tips : ఈ ఆహారాలను తినేటప్పుడు నీళ్ల తాగకూడదు.. ఎందుకో తెలుసా?
చిన్ని చిన్ని ఆశ.. చిన్నదాని ఆశ అనే తమిళ సాంగ్ ప్లే బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతూ సాగిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టకుంటోంది. 97 ఏళ్ల వయసులో బామ్మ ఆకాశంలో ఎగిరేంత సాహసం చేయడం చూసి ప్రతి ఒక్కరు సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఆమె గుండె ధైర్యానికి ఫిదా అవుతూ నెటిజన్లు బామ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఆనంద్ మహీంద్రా సైతం బామ్మ సాహసానికి ఫిదా అయ్యారు. దీంతో బామ్మ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఎగరాడానికి ఇది ఎప్పటికి ఆలస్యం కాదు.. ఈ రోజుకు ఈమే నా హీరో’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై నెటిజన్లు సైతం రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘అద్బుతమైన వీడియో’, ఈ బామ్మ గుండె ధైర్యానికి సెల్యూట్’ ‘అనుకున్నది సాధించడానికి వయసు అడ్డు కాదని ఈ బామ్మ ప్రూవ్ చేశారు’ అంటూ కామెంటస్ చేస్తున్నారు.
Also Read: KTR Comments: కాళేశ్వరాన్ని బద్నాం చేయొద్దు.. బ్యారేజ్ లలో సమస్యలు రావడం సహజం
It’s NEVER too late to fly.
She’s my hero of the day… pic.twitter.com/qjskoIaUt3— anand mahindra (@anandmahindra) November 23, 2023