మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ . నల్లగొండ పట్టణంలో రోడ్ల విస్తరణలో పోతున్న యాభై ఏళ్ళకు పైబడ్డ వృక్షాలకు తిరిగి పునరుజ్జీవం పోస్తున్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు. నల్లగొండ మున్సిపల్ కమీషనర్ రమణాచారి విజ్ఠప్తిని మన్నించి రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ట్రీస్ ట్రాన్స్ లొకేషన్ కార్యక్రమానికి పూనుకున్నారు. మంగళవారం ఉదయం నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్…