Old Phones: కొత్త ఫోన్‌పై మోజుతో పాత సెల్‌ఫోన్లను అపరిచిత వ్యక్తులకు విక్రయిస్తున్న వారికి రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. పాత ఫోన్ అమ్మి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు.
పాత మొబైల్ ఫోన్లు కొంటున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 4 వేల పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరగాళ్లు సైబర్ క్రైమ్ ల కోసం పాత ఫోన్లను వాడుతున్నారని పోలీసులు గుర్తించారు. వాడిన మొబైల్ ఫోన్లకు డబ్బులు ఇచ్చి.. లేదా ప్లాస్టిక్ సామాన్ ఇచ్చి ఫోన్లు కొంటున్నారు.