ఓలా భారతదేశంలో తన మొదటి B2B ఓరియెంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ గిగ్, గిగ్+ అనే రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. ఈ రెండు వేరియంట్ల ధర రూ.50 వేల లోపే. వీటి ధరలు రూ.39,999, రూ.49,999గా నిర్ణయించింది. ఈ ఈవీలను సరకుల రవాణా కోసం రూపొందించారు.