శ్రీలంకలో సంక్షోభం మరింత ముదిరింది. ఒకవైపు పెరుగుతున్న. ఆహార ధరలు… మరోవైపు ఆందోళన నడుమ శ్రీలంక వాసులు తల్లిడిల్లిపోతున్నారు. ఎప్పుడూ ఎమీ జరుగుతోంది అర్థం కాని అయోమయాపరిస్దితిల్లో బతుకుతున్నారు.. నెలరోజులుగా రోడ్డెక్కి నినదిస్తున్న శ్రీలంక ప్రజల ఆందోళన హింసాత్మకంగా మారుతున్నాయి. దీనికి కారణం ఆందోళనకారులను బలప్రయోగంతో అణచివేయాలని అక్కడి ప్రభుత్వం భావించడమేనని అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు రోజుల క్రితం లంక రాజధాని కొలంబో సమీపంలోని రాంబక్కన్ పట్టణంలో ప్రజలు నిర్వహిస్తున్న ఆందోళనలో హింస చోటుచేసుకుంది.…