హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన తెలంగాణ రాష్ట్ర ఒగ్గు బీర్ల కళాకారులు.మల్లన్న ఒగ్గు కథ చెబుతూ .. ఒగ్గు సంప్రదాయ పూజలు చేసి నిరసన తెలిపిన ఒగ్గు పూజారులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఒగ్గు పూజారులను గర్భగుడి పూజల నుంచి బహిష్కరించడం దారుణమన్నారు. ఎన్నో ఏళ్లుగా పూజారులుగా కొనసాగుతున్న తమను తొలిగించి..వీర శైవ (బలిజ) పూజారులను కొనసాగించడంపై ఒగ్గుపూజారులు అభ్యంతరం వ్యక్తం…