Sub-Registrar Office : హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఒక ఊహించని పరిణామంతో వార్తల్లో నిలిచింది. అధికారుల నిర్లక్ష్యం, ఆర్థిక అశ్రద్ధకు పరాకాష్టగా, ఏకంగా 40 నెలల అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో కార్యాలయ భవన యజమాని తాళం వేయాల్సి వచ్చింది. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. వివరాల్లోకి వెళితే.. అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. అయితే, గత 40 నెలలుగా (సుమారు మూడున్నర సంవత్సరాలు)…