మూసీ సుందరీకరణ రాజకీయం ఎటు పోతోంది? పొలిటికల్ వార్‌లో పైచేయి కోసం అధికార, ప్రతిపక్షాలు అనుసరించబోతున్న వ్యూహాలేంటి? వేస్తున్న కొత్త ఎత్తులేంటి? కాంగ్రెస్ రివర్స్ అటాక్‌తో ముందు డిఫెన్స్‌లో పడ్డట్టు కనిపించిన బీఆర్ఎస్ ఇప్పుడు వేస్తున్న కొత్త ఎత్తు ఏంటి? ఏ రూపంలో జనంలోకి వెళ్ళాలనుకుంటోంది? మూసీ సుందరీకరణ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్ నగరం నడి బొడ్డున పారుతున్న ఒకప్పటి మంచి నీటి నది ఇప్పుడు మురికి కూపంగా మారిపోయింది.…
అంబటి రాంబాబు.... ఏపీ పాలిటిక్స్ మీద కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా....అస్సలు పరిచయం అక్కర్లేని పేరు. మంత్రి హోదాలో మాట్లాడినా, వైసీపీ ప్రతినిధిగా మైకందుకున్నా... తన వాగ్ధాటితో ప్రత్యర్థుల మీద విరుచుకుపడే అంబటి... ప్రస్తుతం కొత్త చిక్కుల్లో పడ్డారన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోందట.
తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాలు టార్గెట్‌గా పెట్టుకుంది బీజేపీ. ఎన్ని ఓట్లు పడ్డాయో అన్ని సభ్యత్వాలు ఎందుకు చేయించలేమన్న చర్చ సైతం జరిగింది పార్టీలో. ఆ క్రమంలోనే 50 లక్షల టార్గెట్ తెర మీదికి వచ్చింది. కానీ... టైం గడుస్తున్నా... ఇప్పటి వరకు కేవలం 15 లక్షల దాకా అయి ఉంటాయని పార్టీ నేతలే చెబుతున్నారు. అంటే... వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే.... తక్కువ సమయంలో ఇంకో 35 లక్షల మందిని సభ్యులుగా చేర్చాల్సి ఉంటుంది. పార్టీ…
పవర్లో ఉన్నా... చాలా విషయాల్లో పైచేయి అవలేకపోతున్నామని ఫీలవుతున్నారట తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పెద్దలు. ప్రజలకు మంచి చేస్తున్నా... అది వెళ్ళాల్సినంత ఎక్కువగా వెళ్ళడం లేదన్న చర్చ పార్టీలో గట్టిగానే జరుగుతోందంటున్నారు. ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉన్న... విచ్చలవిడిగా పని చేసిన పార్టీ శ్రేణులు అధికారంలోకి వచ్చాక కాస్త సైలెంట్‌గా ఉంటున్నాయన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉందట. చివరికి ప్రతిపక్షాల విమర్శల్ని సైతం దీటుగా తిప్పికొట్టలేకపోతున్నామన్న అభిప్రాయం గాంధీభవన్ పెద్దల్లో ఉందంటున్నారు.
వైసీపీ అధిష్టానానికి తత్వం బోథపడిందా? ఎన్నికలకు ముందు చేసిన ప్రయోగాలన్నీ వికటించాయన్న సంగతిని గ్రహించిందా? చేతులు కాలాకైనా ఆకులు పట్టుకుని కాస్త ఉపశమనం పొందుదామని అనుకుంటోందా? ఆ క్రమంలోనే ప్రస్తుతం పార్టీలో మార్పులు చేర్పులు జరుతున్నాయా? ఇంతకీ వైసీపీ పెద్దల్లో వచ్చిన ఛేంజ్ ఏంటి? జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఏకంగా 82 సిట్టింగ్ సీట్లను అప్పట్లో మార్చారు జగన్. ఇందులో కొందరికి…
సినీనటి జెత్వానీ కేసులో కొత్త కొత్త ట్విస్ట్‌లు ఉంటాయా? ఇంకొందరు ఐపీఎస్ ఆఫీసర్స్ మెడకు చుట్టుకోబోతోందా? ఈ ఎపిసోడ్లో మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి పేరు ఎందుకు వస్తోంది? ఇప్పటికే సస్పెండ్ అయిన ముగ్గురు ఐపీఎస్‌లు మరికొన్ని కేసుల్లో కూడా ఇరుక్కోబోతున్నారన్నది నిజమేనా? అసలు జెత్వానీ కేసు కేంద్రంగా జరగబోతున్న కొత్త పరిణామాలు ఏంటి? సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో ఏపీకి చెందిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ సస్పెండ్ అయ్యారు. అది కూడా ఆమెను కేసులతో…
అది పేరుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు. కానీ... తీరు మాత్రం అసెంబ్లీ ఎన్నికల రేంజ్లో ఉందట. ఎప్పుడో వచ్చే మార్చిలో ఖాళీ అయ్యే సీటు కోసం ఇప్పట్నుంచే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కసరత్తు మొదలు పెట్టాయంటేనే దాని రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ ఏదా ఎమ్మెల్సీ?
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులు దక్కబోతున్నాయా? రాష్ట్రంలోని అసంతృప్క నేతలందర్నీ బుజ్జగించే ప్రోగ్రామ్ మొదలైందా? ఏఐసీసీ లిస్ట్‌లో ఉన్న రాష్ట్ర నాయకులు ఎవరెవరు? వాళ్ళకు దక్కబోయే పదవులేంటి?
అక్కడ టీడీపీ వర్సెస్ టీడీపీగా యుద్ధం నడుస్తోందా? పార్టీ సీనియర్ లీడర్ ఏకంగా మంత్రి మీదే ఎర్రచందనం, మట్టి మాఫియా ఆరోపణలు చేయడాన్ని ఎలా చూడాలి? ప్రభుత్వ కార్యక్రమం వేదికగా రోజుకో నాయకుడి మీద పూనకం వచ్చినట్టు ఊగిపోతున్న ఆ టీడీపీ సీనియర్ ఎవరు? ఎక్కడ జరుగుతోందా తన్నులాట?
అసలు వాళ్ళకు పదవులు ఉన్నట్టా? లేనట్టా? ఆఫీస్‌కు వెళ్ళాల్నా? అవసరం లేదా? ఆ విషయంలో పీసీసీ అధ్యక్షుడితో సహా తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవ్వరికీ క్లారిటీ లేదు. అందుకే వాళ్ళు గాంధీభవన్ ముఖం చూడ్డం కూడా మానేశారట. పవర్లో ఉన్న పార్టీకి అంత గందరగోళం ఎందుకు? అలా కన్ఫ్యూజ్ అవుతున్న ఆ నాయకులు ఎవరు? ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?