బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎందుకు బయటికి ఎక్కువగా రావడం లేదు? ఎన్నికల తర్వాత అడపా దడపా మాత్రమే కనిపించడం వెనకున్న అసలు రీజనేంటి? బయట జరుగుతున్న రకరకాల చర్చలకు మించిన మాస్టర్ ప్లాన్ ఉందా? నన్ను ఓడిస్తే... వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని గతంలో అన్న మాటల్ని నిజం చేస్తున్నారా? లేక సమయం ఉంది మిత్రమా.... అంత తొందరేల అంటున్నారా? అసలేం జరుగుతోంది?
ఆ ఎమ్మెల్యే అడుసు తొక్కేసి కాలు కడుక్కోవడానికి, కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారా? పవర్ ఉంది కదా అని రెచ్చిపోయి నోటికి పని చెప్పిన శాసనసభ్యుడికి ఆ పవర్ కట్ చేస్తామంటూ పార్టీ పెద్దల నుంచి వార్నింగ్ వచ్చిందా? ఆయనగారి నోటి దురుసుపై సొంత పార్టీ నేతలు సైతం ఒక్కొక్కరే బయట పడుతున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన బూతు పురాణం?
రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య బీజేపీ వైపు చూస్తున్నారా? లేక బీజేపీ అధినాయకత్వమే ఆయన్ని రా...రమ్మని పిలుస్తోందా? కారణం ఏదైనా... ఆయన కాషాయ కండువా కప్పుకుంటారా? ఆ విషయమై రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీ నుంచి వైసీపీ తరపున పెద్దల సభకు వెళ్లిన కృష్ణయ్య పార్టీ మార్పుపై పదే పదే ఎందుకు ప్రచారం జరుగుతోంది?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గంపై బీఆర్ఎస్ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టిందట. ప్రత్యేకించి కేసీఆర్ ఈ వ్యవహారాన్ని పర్సనల్గా తీసుకున్నారట. అక్కడున్న సీనియర్ లీడర్కు గట్టి గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట. ఇంతకీ ఆ సీటు విషయంలో కేసీఆర్ ఎందుకంత పట్టుదలగా ఉన్నారు? ఆయన కత్తులు నూరుతున్న ఆ సీనియర్ ఎవరు?
తిరుమల శ్రీవారికి మహా భక్తురాలు ఆ మాజీ మంత్రి. అది ఎంతలా అంటే... సాధారణ భక్తులు ఎవ్వరికీ వీలవని విధంగా వారానికోసారి, కుదిరితే రెండు సార్లు కొండెక్కి దర్శనం చేసుకునేంత. మరి అంతటి భక్తి ఉన్న నాయకురాలు శ్రీవారి మహా ప్రసాదం లడ్డూపై ఇంతటి వివాదం జరుగుతున్నా.. ఎందుకు మాట్లాడటం లేదు? అసలా విషయమే తెలియదన్నట్టుగా కామైపోవడానికి కారణాలేంటి? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏమా భక్తిరస కథాచిత్రమ్?
గులాబీ పార్టీ ట్రాక్ అండ్ ట్రెండ్ మార్చాలనుకుంటోందా? పోగొట్టుకున్న చోటే వెదుక్కునే ప్లాన్కు పదును పెడుతోందా? అటు సీనియర్స్ని సంతృప్తి పరచడం, ఇటు పార్టీ అవసరాలు తీర్చుకోవడమన్న రెండు పిట్టల్ని ఒకే దెబ్బకు కొట్టాలనుకుంటోందా? జనంలోకి దూకుడుగా వెళ్ళడానికి బీఆర్ఎస్ వేస్తున్న కొత్త స్కెచ్ ఏంటి? దాని మీద పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది?
హైడ్రా అంటే జీహెచ్ఎంసీకి పడటం లేదా? రెండు ప్రభుత్వ విభాగాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందా? జీతాలిచ్చేవాళ్ళంటే… జోకై పోయిందా అంటూ గ్రేటర్ అధికారులు హైడ్రా సిబ్బంది మీద ఫైరైపోతున్నారా? అసలెందుకా పరిస్థితి వచ్చింది? రెండు విభాగాలు ప్రభుత్వ అధినంలోనే ఉన్నా… ఎక్కడ తేడా కొడుతోంది? మన తిండి తిని పక్కోడి చేలో పనిచేస్తున్నారన్న అభిప్రాయం గ్రేటర్ అధికారుల్లో పెరగడానికి కారణాలేంటి? గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులు, నాలాలు కబ్జా కాకుండా చర్యలు…
అట్టహాసంగా కట్టుకున్న బీఆర్ఎస్ ఆఫీసులకు ముప్పు ముంచుకొస్తోందా? నాడు అధికార బలంతో మనల్ని అడిగేది ఎవ్వడన్నట్టుగా నిర్మించిన పార్టీ కార్యాలయాల మీదికి ఇప్పుడు నిబంధనల బుల్డోజర్స్ దూసుకొస్తున్నాయా? పార్టీకి కొత్తగా ఇదో తలనొప్పిగా మారిందా? అసలు పార్టీ ఆఫీసుల నిర్మాణాలు ఎలా జరిగాయి? వాటికి ఏ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది? ప్రతి జిల్లాలో పార్టీకి శాశ్వత కార్యాలయం ఉండాలన్న టార్గెట్తో… తాము అధికారంలో ఉన్నప్పుడు భారీ భవంతులు నిర్మించింది బీఆర్ఎస్. అయితే అప్పుడు పవర్ మనదేకదా అన్న…